భారత్ UPIకి ప్రపంచం ఫిదా!
కూరగాయల బండి నుంచి అంతర్జాతీయ వ్యాపారాల వరకు… UPI భారత్లో డిజిటల్ చెల్లింపుల తీరునే మార్చేసింది! పదేళ్ల క్రితం 1.78 కోట్ల లావాదేవీలతో మొదలైన UPI ప్రయాణం.. 2025-26 నాటికి ఏకంగా 24,162 కోట్ల లావాదేవీలకు చేరింది. అంతేకాదు, UPI లావాదేవీల్లో 86 శాతం రూ.500లోపు ఉన్నవే కావడం విశేషం.
ఇప్పుడు UPI ప్రభావం భారత్ దాటి ప్రపంచ దేశాలకు చేరుతోంది. UAE, ఫ్రాన్స్, సింగపూర్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మౌరిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవులు సహా 11 దేశాలు UPIని స్వీకరించాయి.
చిన్న చెల్లింపుల నుంచి అంతర్జాతీయ లావాదేవీల వరకు విస్తరిస్తున్న భారత్ డిజిటల్ చెల్లింపుల విధానం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
భారత్లో మొదలైన UPI ప్రయాణం.. ప్రపంచానికి డిజిటల్ చెల్లింపుల కొత్త దారి చూపిస్తోందా?
